అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు నాగచైతన్య. ఇప్పుడు నాగ చైతన్య కూడా విభిన్నమైన సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక సినిమాలతో పాటు నాగ చైతన్య వెబ్ సిరీస్ లలో కూడా చేసి హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే కదా. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ప్రధాన పాత్రలో వచ్చిన వెబ్ సిరీస్ దూత. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గత ఏడాది డిసెంబర్ 1 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈవెబ్ సిరీస్ మంచి హిట్ టాక్ నే అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు దూత సీక్వెల్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్ ను రేపు అంటే మార్చి 19వ తేదీన ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం రేపు దీనిపై అప్ డేట్ ఏదైనా వస్తుందేమో. కాగా ఈ వెబ్ సిరీస్ లో ప్రియా భవానీ శంకర్, పార్వతీ తిరువొతు, ప్రాచీ దేశాయ్, పశుపతి, రవీంద్ర విజయ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై శరత్ మరార్ ఈ సిరీస్ ను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: