RC16 వేరే లెవల్ లో ఉంటుంది

shiva rajkumar interesting comments on ram charans RC16 movie

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఇప్పుడు తన నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా గురించి తాజాగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివరాజ్ కుమార్ ఈసినిమా గురించి చెబుతూ.. బుచ్చిబాబు రామ్ చరణ్ కథతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా షాకయ్యాను.. ఈసినిమా వేరే లెవల్ లో ఉండబోతుంది.. ఈ క్యారెక్టర్ ను బుచ్చిబాబు ఎలా ఇమాజిన్ చేసుకున్నాడా అని నేను వండర్ అయ్యాను.. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం.. తను చాలా మంచి మనిషి, ఎక్స్ ట్రా ఆర్డినరీ యాక్టర్. 30 నిమిషాలు నెరేషన్ ను మొదలుపెడితే అది కాస్త ఒకటిన్నర గంటలు పట్టింది అని తెలిపాడు. ఇప్పుడు శివ రాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆర్సీ16పై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

కాగా ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + one =