ఈవారం బ్రోచేవారెవరురా త్రయం శ్రీ విష్ణు,రాహుల్ రామకృష్ణ ,ప్రియదర్శి కలిసి నటించిన ఓం భీమ్ బుష్ థియేటర్లలోకి రానుంది.టీజర్,ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది.నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఇక ఈసినిమాకు ఇన్సైడ్ రిపోర్ట్స్ అయితే షురూ షాట్ హిట్ అనేలా వున్నాయి.సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట.కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని సినిమా అయితే హిలేరియస్ గా ఉందని అన్నారట.సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు.2గంటల 15నిమిషాల రన్ టైం తో రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో ఓపెద్ద ట్విస్ట్ కూడా ఉందట అలాగే ఇంటర్వల్,క్లైమాక్స్ సినిమాకు హైలైట్ అయ్యాయట.యూత్ ఈసినిమాకు బాగా కనెక్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.మరి రిపోర్ట్స్ అయితే పాజిటివ్ గానే వస్తున్నాయి.మరి ఆడియెన్స్ ఈసినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే ఈ శుక్రవారం వరకు ఆగాల్సిందే.
హుషారు ఫేమ్ హర్ష కోనుగంటి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో బిగ్ బాస్ 17ఫేమ్ అయేషా ఖాన్ ,ప్రీతి ముఖుంధన్ హీరోయిన్లుగా నటించగా సన్నీ ఎమ్ ఆర్ సంగీతం అందించాడు.యూవీ సెల్ల్యులాయిడ్ తో కలిసి సునీల్ బలుసు ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: