గత నెలలో మలయాళం విడుదలైన రెండు సినిమాలు గ్లోబల్ వైడ్ గా దుమ్ముదులుపుతున్నాయి.అందులో ఒకటి ప్రేమలు కాగా మరొకటి మంజుమ్మెల్ బాయ్స్.ఇందులో ప్రేమలు మొదట విడుదలై ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 107 కోట్ల వసూళ్లను రాబట్టింది.రీసెంట్ గా ఈసినిమా తెలుగులో కూడా విడుదలకాగా ఇక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.నిన్న ఈసినిమా తమిళంలో కూడా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరో సినిమా మంజిమ్మెల్ బాయ్స్ అయితే మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.2018 సినిమా కలెక్షన్స్ బ్రేక్ చేసి ఈ ఫీట్ ను సాధించింది.నిన్నటి వరకు మంజిమ్మెల్ బాయ్స్ ప్రపంచ వ్యాప్తంగా 180కోట్ల వసూళ్లను దక్కించుకుంది.ఫుల్ రన్ లో 200కోట్ల మార్క్ ను చేరుకోనుంది.ఇక ఈసినిమా కూడా తెలుగు లోకి రానుంది.ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను తెలుగు లో విడుదలచేయనుంది.ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.అన్ని కుదిరితే వచ్చే శుక్రవారం ఈసినిమా విడుదలకానుంది.మరి మలయాళం లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈసినిమా తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాను చిదంబరం డైరెక్ట్ చేశాడు.2006లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా కేవలం 10కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈసినిమా బయ్యర్లకు ఊహించని లాభాలను తీసుకొస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: