ఉస్తాద్ భగత్ సింగ్- పవర్ ఫుల్ వీడియో రిలీజ్

powerful video out from ustaad bhagat singh movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు, సుజీత్ దర్శకత్వంలో ఓజీ అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఓజీ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. మిగిలిన రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇక పవన్ కూడా రాజకీయాలతో బిజీగా ఉండటంతో ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక పవన్ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్లు రాని తరుణంలో సడెన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి అన్ ఎక్స్ పెక్టెడ్ అప్ డేట్ వస్తుందని సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ లో మళ్లీ ఉత్సాహం మొదలైంది. ఆ అప్ డేట్ ఏంటని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఆ అప్ డేట్ రానే వచ్చింది. భగత్ బ్లేజ్ అంటూ రిలీజ్ చేసిన వీడియో పవర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా ఎలక్షన్స్ దృష్ట్యా కనెక్ట్ అయ్యేలా వీడియోను కట్ చేసినట్టు అర్థమవుతుంది.

కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + nine =