వచ్చే వారంలో విజయ్ ది గోట్ అప్డేట్

the greatest of all time update coming soon 

దళపతి విజయ్ – డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం).ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.అందులో ఒకటి హీరో పాత్ర కాగా మరొకటి విలన్ పాత్ర.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు ఈసినిమా నుండి విజయ్ లుక్ ను రివీల్ చేస్తూ పోస్టర్ లను వదిలారు.ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ రానుంది.వచ్చే వారం ఈసినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ రానుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకట్ ప్రభు వెల్లడించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో సీనియర్ హీరో ప్రశాంత్ ,లైలా ,మీనాక్షి చౌదరీ,యోగిబాబు వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్  నిర్మిస్తుంది.దీపావళికి విడుదలచేసే ప్లాన్ లో వున్నారు.ఈసినిమా థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ వుంది.ఇప్పటికే డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఇక ఈసినిమా తరువాత విజయ్ మరో సినిమా మాత్రమే చేయనున్నాడు. ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ గా బిజీ అవ్వనున్నాడు.రీసెంట్ గా విజయ్ తన పార్టీ పేరును కూడా ప్రకటించాడు.తన చివరి సినిమాను ప్రముఖ టాలీవుడ్  నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − eight =