ఆడియెన్స్ నవ్వే నవ్వులకు థియేటర్స్ బద్దలైపోతాయి – శ్రీవిష్ణు

Sree Vishnu Reveals Interesting Facts About Om Bheem Bush

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ చిత్రం ‘ఓం భీమ్ బుష్’. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సగర్వంగా సమర్పిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ పాజిటివ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘ఓం భీమ్ బుష్’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “మార్చి 22న థియేటర్స్ కి రండి. మీరు నవ్విన నవ్వులకు థియేటర్స్ బద్దలైపోతాయి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూప్స్ తో వెళితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. 22న ఎవరూ మిస్ అవ్వొద్దు. మిమ్మల్ని నవ్వించాలనే ఉద్దేశంతోనే సినిమా చేశాం. రెండు వందల శాతం పిచ్చిపిచ్చిగా నవ్వుతారు. కేవలం ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన యూవీ వంశీ అన్నకి, సునీల్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు హర్ష చాలా హిలేరియస్ గా సినిమాని తీశారు. సినిమా యూనిట్ అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + nineteen =