మిస్టర్ బచ్చన్‌.. జగపతిబాబు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్

Jagapathi Babu First Look Poster Released From Mr. Bachchan Movie

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్‌’. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులోకి ఒక స్టార్ నటుడు ఎంటరయ్యారు. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. టాలీవుడ్ బిజీయెస్ట్ యాక్టర్స్‌లో ఒకరైన జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనికి సంబంధించి తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో జగపతి బాబు ఇంటెన్స్, ఫెరోషియస్ లుక్‌లో కనిపించారు. చెస్ మూవ్‌ని చేతిలో పట్టుకొని సీరియస్‍గా చూస్తున్న లుక్ అదిరిపోయింది. ‘మిస్టర్ బచ్చన్‌’లో జగపతి బాబు పాత్ర చాలా పవర్ ఫుల్‍గా ఉండబోతుందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్‌డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. సో.. ఈ డెడ్లీ కాంబో కోసం మూవీ లవర్స్ గెట్ రెడీ. రవితేజ, జగపతిబాబులను తెరపై చూడటం కనుల పండువగా ఉంటుంది. ఇద్దరికీ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ రాసుకున్నారు హరీష్ శంకర్.

వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 50 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పటివరకు దాదాపు 80% ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఇక మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, కెమెరామెన్ అయనంక బోస్ డీవోపీగా పని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.