పుష్ప 2 టీజర్ రిలీజ్- బన్నీ మాస్ జాతర

allu arjun pushpa 2 movie teaser out now

మొత్తానికి ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది పుష్ప2 టీజర్ కోసం. నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. అప్పటినుండి టీజర్ ఎప్పుడువస్తుందా అని చూస్తున్నారు. ఫైనల్ గా టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక టీజర్ లో బన్నీ మరోసారి మాస్ జాతర చూపించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చీర కట్టుకొని ఒంటి నిండా నగలుతో ఉన్న బన్నీ లుక్కే కిక్ ఇస్తుంది. దానికితోడు యాక్షన్ సీక్వెన్స్, బన్నీ యాటిట్యూట్, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా.. టీజర్ మాత్రం ఫుల్ ఫీస్ట్ ను అందించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఈ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడంతో అల్లు అర్జన్ క్రేజ్ కూడా దేశవ్యాప్తంగా పెరిగింది. ఇక ఈసినిమాతోనే బన్నీ కి నేషనల్ అవార్డ్ తో పాటు పలు అవార్డులు కూడా దక్కాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మరి పార్ట్ 2 తో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.