టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇక గత ఏడాది సామజవరగమన అనే సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాను కూడా లైన్ లో పెట్టేశాడు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఈసినిమా టైటిల్ ను నేడు రిలీజ్ చేస్తానని ఇప్పటికే తెలియచేసిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు స్వాగ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. అడవిలో జంతువులు అన్ని మాట్లాడుకున్నట్టు, కథలు చెప్పినట్టు వాటికి సునీల్, గంగవ్వ.. వాయిస్ లు పెట్టి నవ్విస్తూ ‘స్వాగ్’ టైటిల్ ని ప్రకటించారు. చివర్లో ఈ కథ మగవాడిది, శ్వాగణిక వంశానిది అని శ్రీవిష్ణు వాయిస్ వస్తుంది. గ్లింప్స్ ను బట్టి ఈసినిమా కూడా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. కాగా ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు.
కరిభిత్ గిరిభిత్!!
శ్వాగణిక వంశానికి స్వాగతం 🤘 #SWAG
వివేక్ సాగర్ గాడి మోత లో హసిత్ గోలి గాడి రాత, తీత తో, విశ్వప్రసాద్ నిర్మిత శ్రీవిష్ణు గాడి సినిమా.
మరొకసారి 😉
శ్వాగణిక వంశం కథ: https://t.co/Or9sXoFF1a#SreeVishnuGadiCinema #అచ్చతెలుగుసినిమా @sreevishnuoffl…
— People Media Factory (@peoplemediafcy) February 29, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: