శ్రీ అమృతేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న రాజమౌళి దంపతులు

SS Rajamouli Attends For Prana Pratishta Ceremony of Sri Amrutheshwara Temple at Bellary

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలతో ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గత చిత్రం ‘ఆర్ ఆర్ఆర్’ అయితే అమెరికా, జపాన్ సహా అనేక దేశాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రాజమౌళి పేరు మారుమ్రోగిపోయింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే పట్టాలెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా శ్రీ అమృతేశ్వర ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో గల ఈ దేవాలయంలో జరిగిన దేవతా విగ్రహమూర్తుల ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రాలు ధరించిన ఆయన తన సతీమణి రమా రాజమౌళితో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా ఈ ఆలయాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘వారాహి చలన చిత్ర’ అధినేత సాయి కొర్రపాటి గారు నిర్మించడం గమనార్హం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =