కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఈగల్. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈసినిమా పోటీ నుండి తప్పుకొని సింగిల్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకొని ఫైనల్ గా ఫిబ్రవరి9వ తేదీన రిలీజ్ అయింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రవితేజ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ లోకి రాబోతున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈసినిమా ఓటీటీ హక్కులను ఇప్పటికే ఈటీవి విన్ యాప్ వారు సొంతం చేసుకున్నారు. త్వరలోనే అందులో స్ట్రీమింగ్ కు రానుంది. అయితే ఇప్పుడు మరో ఓటీటీ కూడా ఈసినిమా హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ వారు సొంతం చేసుకున్నారు. ఈమేరకు తాజాగా అమెజాన్ వారు ఈసినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి1వ తేదీ నుండి ఈసినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
కాగా ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలకపాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు సంగీతం దేవ్ జాన్డ్, సినిమాటోగ్రఫి కార్తీక్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























