ఆపరేషన్ వాలెంటైన్.. టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే? – వరుణ్ తేజ్

Varun Tej Reveals Interesting Facts About Operation Valentine

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించగా.. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. నాకు కథ చాలా నచ్చింది. నేను సోనీ పిక్చర్స్‌తో అంతకుముందు ఓ సినిమా చేయాలి. కానీ అది కొన్ని కారణాల వలన టేకాఫ్ కాలేదు. ఈ కథ వారికి పంపించినపుడు వారికీ నచ్చింది. వాళ్ళు కూడా అన్నీ వార్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు తీస్తున్నారు. నేషనల్ అప్పీల్ వున్న కంటెంట్ ఇది.

చాలా గ్రాండ్ బడ్జెట్‍తో పక్కాగా ప్లాన్ సినిమాని చేశారు. దర్శకుడు హిందీ అబ్బాయి అయినప్పటికీ సినిమాని తెలుగులో చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. సోనీ పిక్చర్స్ వచ్చిన తర్వాత హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సీన్‌ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం.

ఇలాంటి వార్ బ్యాక్ డ్రాప్ సినిమాని కొత్త దర్శకులతో చేయడం ఒక సవాల్ అనిపించలేదా?

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్‌లో చాలా ప్యాషన్ వుంది. ఏదో ఒక సినిమా చేసేయాలనే ఆలోచన తనలో లేదు. ప్రత్యేకంగా ఈ కథనే నా ద్వారా చెప్పాలని అనుకున్నాడు. ఆ పాషన్, నమ్మకం తనలో కనిపించాయి. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడు. అంతకుముందు తను చేసిన షార్ట్ ఫిల్మ్ చాలా వైరల్ అయ్యింది. ఎయిర్‌ఫోర్స్ అధికారులు కూడా అది చూసి ఆశ్చర్యపోయారు.

దీనిపై సినిమా చేయాలనుకున్నపుడు ఇంకా కావాల్సిన సమాచారం ఇస్తామని వారు చెప్పారు. ఈ కథని చాలా ప్యాషన్‌తో చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్‌పై కూడా చాలా మంచి పట్టు వుంది. నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్‌ని చాలా అద్భుతంగా రాబట్టుకునే నేర్పు తనలో వుంది.

వార్ సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం?

2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌గా ఈ ఎటాక్ ప్లాన్ చేయడం జరిగింది.

ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద వున్న ప్రేమ. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించాం. పుల్వామా ఘటనపై ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ ది బెస్ట్ అని వారు ప్రసంశించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.

ఏరియల్ వార్ అంటే వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటాయి కదా.. ఒక నటుడిగా ఇది మీకు సవాల్‌గా అనిపించిందా?

అంతరిక్షం సినిమా సమయంలో తొలిసారి వీఎఫ్ఎక్స్‌ని ఎక్స్ పీరియన్స్ చేశా. గ్రీన్ స్క్రీన్ చూపించి అక్కడే చంద్రుడు ఉన్నాడని చెబితే కాస్త ఇబ్బందిగా అనిపించింది (నవ్వుతూ). రానురాను అది అలవాటైంది. ఈ సినిమా విషయానికి వస్తే అసలు ఫైటర్ ఫ్లైట్ ఎలా పని చేస్తుంది, ఎంత స్పీడ్‌లో వెళుతుంది, ఎలా మలుపుతిరుగుతుంది? ఇవన్నీ ముందే ఒక పైలెట్‍ని అడిగి తెలుసుకున్నా. ఆయన చాలా ప్రోత్సహించారు. ఒక ఫ్లైట్ సిమ్యులేటర్‌లో కూర్చోబెట్టి రియల్ లైఫ్ ప్రొజెక్షన్ అనుభూతిని ఇచ్చేలా చేశారు.

అందులో కూర్చుంటే రియల్‌గా ప్లయిట్ నడిపినట్లే వుంటుంది. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. ఇలాంటి పాత్రలు చేయడం ఒక ఛాలెంజ్. ముఖం మొత్తం ఆక్సిజన్ మాస్క్‌తో కప్పబడి వుంటుంది. ఎమోషన్‌ని కళ్ళతోనే పలికించాలి. ఇందులో రుద్ర పాత్రలో కనిపిస్తాను. కొందరు రియల్ ఎయిర్ ఫైటర్స్ స్ఫూర్తితో నా పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు. రుద్ర పాత్రతో అందరూ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.

హిందీలో చేయడం ఎలా అనిపించింది?

హిందీ కోసం రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. డిక్షన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎమోషనల్ డైలాగులు చెప్పడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక సీన్‌ని మొదట హిందీలో షూట్ చేసి తర్వాత తెలుగులో షూట్ చేసిన్నపుడు మధ్యమధ్యలో హిందీ డైలాగులు కూడా వచ్చేసేవి (నవ్వుతూ) చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ చేసేవాళ్ళం.

హీరోయిన్ మానుషి చిల్లర్ గురించి?

మానుషి చిల్లర్ మిస్‌వరల్డ్ విన్నర్‌గా దేశని పేరు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్రపై చాలా ఫోకస్‌గా వుంటుంది. రాడర్ ఆఫీసర్‌గా కనిపించడానికి చాలా హోం వర్క్ చేసింది.

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి?

మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. ఈ సినిమా కోసం దర్శకుడే మిక్కీ అయితే బావుంటుందని అనుకున్నారు. ఇందులో పాటలు ఎమోషనల్‌గా వుంటాయి. మనసుని హత్తుకుంటాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా చాలా బలంగా వుంటుంది.

‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా మీరు చేయడంపట్ల పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించారు?

టీజర్ రిలీజ్ అయిన తర్వాత బాబాయ్‌ని కలవడం జరిగింది. ఆయన సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. బావుంది, గుడ్.. ఇంతవరకే వుంటుంది ఆయన రియాక్షన్. అలాంటి ఆయన ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్‌ని ఐదారుసార్లు చూశాను. చాలా బావుంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా చాలా బాగా కనిపిస్తున్నావ్. సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను’ అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఇలా చెప్పడం చాలా అరుదు. ఇలాంటి సినిమాలు బాబాయ్‌కి చాలా ఇష్టం.

‘మట్కా’ సినిమా ఎలా వుండబోతుంది?

మట్కాలో ఎక్కువ పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ వున్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది మంచి కమర్షియల్ రివెంజ్ డ్రామా.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =