ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా సెకండ్ షెడ్యూల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. సెకండ్ షెడ్యూల్ ప్రారంభానికి ముందే శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు కూడా తెలిపారు. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు. న్యూడిలాండ్ లోనే ప్రారంభించిన సెకండ్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందని చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Bringing the story to life, one frame at a time! 🎬 The second schedule of ‘#𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚🏹’ in breathtaking #NewZealand is in full swing.@themohanbabu @ivishnumanchu @mukeshvachan @24FramesFactory @avaentofficial @KannappaMovie#KannappaMovie #ATrueIndianEpicTale… pic.twitter.com/2Pw18DNZe5
— 24 Frames Factory (@24FramesFactory) February 28, 2024
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ విష్ణు తనయుడు అవ్రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఇంకా పలువురు స్టార్లు ఈసినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























