రజినీకాంత్‌తో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌ కొత్త సినిమా

Superstar Rajinikanth and Producer Sajid Nadiadwala Team up For A New Film

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. తాజాగా తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ చిత్రంతో ప్రేక్షకులను పలుకరించారు. తన 48 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌ కలిగిన ఆయన ఈ వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడి మరీ సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్‌ ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో ‘వేట్టైయన్’ (#తలైవర్170) అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న ‘#తలైవర్171’ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తలైవర్ తదుపరి సినిమాను అప్పుడే లైన్‌లో పెడుతున్నారు. దీనికోసం ఆయన బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలాతో చేతులు కలపనున్నారు. ఒక క్రేజీ ప్రాజెక్ట్ కోసం మొదటిసారిగా వీరు కలిసి పని చేయనున్నారు. ఈ మేరకు వీరిరువురూ తాజాగా కలుసుకున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ప్రొడ్యూసర్ సాజిద్ నదియాడ్‌వాలా బాలీవుడ్‌లో అనేక హిట్ సినిమాలను నిర్మించారు. అక్కడి అగ్ర హీరోలతో రూపొందించిన ‘కిక్’, ‘హౌస్‌ఫుల్’, ‘హీరోపంతి’ వంటి అతిపెద్ద కమర్షియల్ హిట్‌లు ఆయన నిర్మాణ సారథ్యంలోనివే. దీంతో రజినీకాంత్ బాలీవుడ్‌ బడా నిర్మాతతో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనుందని అభిమానులు భావిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =