తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈ మేరకు శుక్రవారం చిరంజీవి మరియు ఆయన సతీమణి సురేఖ దంపతులు హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌కు విచ్చేసారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై వారికి సాదరంగా ఆహ్వానం పలుకగా.. చిరంజీవి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం గవర్నర్ వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో చిరంజీవికి భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ అవార్డు లభించినందుకు అభినందనలు తెలిపారు. అలాగే ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గత వారంలో మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తాజాగా దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు ‘భారతరత్న’ ప్రకటించింది. తద్వారా ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో మెగాస్టార్ స్పందిస్తూ.. ఆయనకు భారతరత్న దక్కడం తెలుగు వారికి అత్యంత సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
ఇకఇదిలా ఉంటే.. మెగాస్టార్ ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష చిరు సరసన కథానాయికగా నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్లతో బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. భారీ అంచనాలున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: