పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాలు.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. వీటితోపాటు త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయనున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా ‘ఓజీ’ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. భారీ అంచనాలున్న ఈ చిత్రం మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇటీవలే చిత్ర దర్శకుడు సుజీత్ మరియు సంగీత దర్శకుడు ఎస్ తమన్ తాజాగా భేటీ అయ్యారు. ట్యూన్స్ ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ మేరకు వీరు కలిసి చర్చించుకుంటున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలలోని పాటలు ఆకట్టుకునేలా, క్యాచీగా అంటుంటాయి. దీనికితోడు ఈ సినిమా కథాంశం ప్రకారం బీజీఎం కీలకంగా ఉండనుంది. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
The duo who created #HungryCheetah, Director #Sujeeth & Music Director @MusicThaman, begin the musical work for #OG 🎶🔥#PawanKalyan #OGonSept27th #TeluguFilmNagar pic.twitter.com/29cC3vtci6
— Telugu FilmNagar (@telugufilmnagar) February 9, 2024
కాగా గతేడాది సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ఓజీ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. సినిమా ఏ రేంజ్లో ఉండనుందో ఈ గ్లింప్స్‌తో అందరికీ అర్ధమైంది. అందులో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ హైలైట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ రూత్ లెస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వగా.. తమన్ తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: