రవితేజతో కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలనుంది – అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్

Eagle Pre Release Event Anupama Parameswaran and Kavya Thapar Interesting Comments on Ravi Teja

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఈగల్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖ నటుడు నవదీప్ మరియు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపధ్యంలో.. ఆదివారం (ఫిబ్రవరి 05, 2024) ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈవెంట్‌లో భాగంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ‘‘పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నేను నటించిన రెండో చిత్రమిది. విశ్వ ప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా దర్శకుడిని నేను అన్నయ్య అని పిలుస్తా. నాకు అద్భుతమైన పాత్ర ఇచ్చాడు. ఇందులో దాదాపు అందరినటీనటులతో నాకు కాంబినేషన్‌ సీన్స్ వున్నాయి. ఈ చిత్రంలో రవితేజ గారు చాలా అద్భుతంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలనుంది. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈగల్ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వుంది” అని పేర్కొన్నారు

ఇక మరో హీరోయిన్ కావ్యా థాపర్ మాట్లాడుతూ.. “ఈగల్ చిత్రంలో సరికొత్త ప్రేమకథ వుంది. దర్శకుడు కార్తిక్ సినిమాను అద్భుతంగా తీశారు. ఇందులో నా పాత్ర పేరు రచన. నాకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాని భావిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. హీరో రవితేజ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న కథానాయకుడు. ఈ మూవీలో ఆయనతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు చాలా థ్యాంక్స్‌’’ అని తెలిపారు. కాగా ఈగల్ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − three =