శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. వందేమాతరం అంటూ వచ్చే ఈపాటను భారత్-పాక్ సరిహద్దు అయిన వాఘా దగ్గర రిలీజ్ చేశారు. ఈపాటకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. గగనాల అంటూ వచ్చే ఈపాట ప్రోమోను తాజాగా రలీజ్ చేశారు మేకర్స్. మెలోడియస్ గా ఉన్న ప్రోమో అయితే ఆకట్టుకుంటుంది. అర్మాన్ మాలిక్ పాడిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 4 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Fly high with the melody of Love ❤️#OperationValentine Second Song Promo out now❤️🔥
Full Song Tomorrow at 4:03 PM 🤍#Gaganaala #OPVonMarch1st@IAmVarunTej @ShaktipsHada89 @ManushiChhillar @MickeyJMeyer @ArmaanMalik22 @singer_shaan @ramjowrites… pic.twitter.com/AKdky1fMhX
— Saregama South (@saregamasouth) February 5, 2024
కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: