ఈగల్ కంటెంట్ ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుంది – టీజీ విశ్వ ప్రసాద్

Producer TG Vishwa Prasad Reveals Interesting Facts About Eagle

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ‘ఈగల్’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ధమాకా’ తర్వాత రవితేజ గారితో సినిమా చేస్తున్నపుడు సహజంగానే అంచనాలు వుంటాయి కదా.. ఈగల్ ఎలా ఉండబోతుంది?

‘ధమాకా’ మాస్ ఎంటర్‌టైనర్ ఐతే.. ‘ఈగల్’ చాలా క్లాసిక్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ భేస్ మాస్ వుంది. ఈగల్ కంటెంట్ అద్భుతంగా వుంటుంది. ఆడియన్స్‌ని అలరించే చాలా మంచి ఎలిమెంట్స్ వున్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. రవితేజ గారు సరికొత్తగా కనిపించబోతున్నారు. కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్ అన్నీ ఎక్స్‌ట్రార్డినరీ వుంటాయి.

రవితేజ గారితోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి కారణం?

రవితేజ గారితో మాకు ఎక్స్‌ట్రార్డినరీ రిలేషన్‌షిప్ వుంది. ఆ రిలేషన్‌షిప్ తోనే ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాం.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గురించి?

కార్తీక్ ఘట్టమనేని గారితో ఎప్పటినుంచో మా అనుబంధం వుంది. ధమాకా జరుగుతున్న సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాం. ‘ఈగల్’ని అద్భుతంగా తీశారు. మా నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్ చేస్తాం.

ఈగల్ ని జనవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు.. ఇప్పుడు ఫిబ్రవరి 9న వస్తున్నారు.. ట్రేడ్‌లో క్రేజ్ పెరిగిందని భావిస్తున్నారా?

పరిశ్రమ మేలుని ద్రుష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకున్నాం. ట్రేడ్ విషయానికి వస్తే అప్పుడు మేము సెకండ్ బెస్ట్.. ఇప్పుడు నెంబర్ వన్. మిగతా చిత్రాలు వేటి రీచ్ వాటికి వున్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ ఏడాది ఎన్ని సినిమాలు విడుదల కావచ్చు?

మినిమం 15 సినిమాలు విడుదలౌతాయి. ఇవి పోస్ట్ ప్రొడక్షన్‌లో వున్నాయి. ప్రొడక్షన్‌లో దాదాపు 6 చిత్రాలు వున్నాయి. ఇవి కాకుండా ‘ఈటీవీ విన్’ కోసం కొన్ని చిత్రాలు నిర్మాణం అవుతున్నాయి. అలాగే దాదాపు నాలుగు సినిమాలు అమెరికాలో చేస్తున్నాం. ప్రతి నెలా మా నుంచి ఒక చిత్రం విడుదల కానుంది. ఈ ఏడాది 50 చిత్రాల మైలు రాయిని అందుకుంటామని భావిస్తున్నాం.

ప్రభాస్ గారి ‘రాజాసాబ్’ ఎప్పుడు?

తర్వలోనే తెలియజేస్తాం.

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ చేసే ఆలోచన ఉందా?

మేము ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ చేయడం వుండదు. కానీ మేము ఓటీటీలో బిగ్గర్ రోల్ ప్లే చేస్తాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 5 =