గుంటూరుకారం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

mahesh babu guntur kaaram movie ott release date fixed

ఎంతోకాలంగా వెయిట్ చేసిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశాడు. మహేష్ బాబు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్ డేట్ వచ్చింది. ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అయితే ఈసినిమా రిలీజ్ అయి నెలరోజులు కూడా కాకముందే ఇంత తొందరగా ఓటీటీలోకి రిలీజ్ చేయడం విశేషం. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం ఇంకా హిందీలో కూడా ఈసినిమా అందుబాటులోకి రానుంది.

కాగా త్రివిక్రమ్  శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించగా రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. థమన్ సంగీతం అందించిన ఈసినిమాను..హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 16 =