పద్మశ్రీ కొండప్పకు బలగం టీమ్ సన్మానం

dil raju and balagam team presented one lakh rupees to dasari kondappa

చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి ఆదరణను సొంతం చేసుకుంది బలగం. ఈ సినిమాలోని కథ, సన్నివేశాలు, పాత్ర సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండటంతో చాలా మందికి కనెక్ట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మేకర్స్ కు పదింతలు లాభాలు చేకూర్చింది. ఇక ఈసినిమాకు వచ్చిన అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. బుర్రవీణ సంగీత పరికరంతో పలు పల్లెజానపదాలు పాడుతూ తెలంగాణ సంసృతిని చాటుతున్నారు దాసరి కొండప్ప. ఈయన బలగం సినిమాలో కూడా ఒక పాట పాడి నటించారు కూడా. ఈనేపథ్యంలో డైరెక్టర్ వేణు, దిల్ రాజుతోపాటు మేకర్స్ కొండప్పను కలిసి అభినందిస్తూ సన్మానించారు. ఈమేరకు లక్ష రూపాయల చెక్ ను కూడా అందించారు దిల్ రాజు. ఈ వీడియోను నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ లో షేర్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =