మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా త్వరలో ఈగల్ అంటూ రాబోతున్నాడు. ఈసినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ గురించి తన ట్విట్టర్ ద్వాారా అప్ డేట్ ఇచ్చాడు. తన ట్విట్టర్ లో ఈసినిమా కోసం వేసిన అందమైన ఇంటి సెట్ నుండి ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ హౌస్ లో షూటింగ్ చేయడానికి వెయిట్ చేయలేకపోతున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
కాగా ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: