జర్మనీలోని బ్లాక్‌ ఫారెస్ట్‌లో మహేష్‌ బాబు ట్రెక్కింగ్, ఫోటోస్ వైరల్

Mahesh Babu Trekking in Black Forest at Germany, Pics Goes Viral

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘గుంటూరు కారం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక తన తర్వాతి చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి దీనిని #ఎస్ఎస్ఎంబీ29 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు. కాగా రాజమౌళి ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా రూపొందించనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అమెరికా, జపాన్ సహా అనేక దేశాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన మహేష్‌తో తీయబోయే చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రపంచ దేశాలను చుట్టి వచ్చే సాహసిక యాత్రికుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే దీనిలో భాగంగా అమెజాన్ అడవుల్లో ట్రెజర్ హంట్ నేపథ్యం కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తన ఫిజిక్‌పై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడానికి మహేష్ ఇటీవలే జెర్మనీ వెళ్లారు. ఈ క్రమంలో ఆయన తన ఫిట్‌నెస్‌ డాక్టర్‌ హ్యారీ కొనిగ్‌తో కలిసి అక్కడి బ్లాక్‌ ఫారెస్ట్‌ పర్వతంపై ట్రెక్కింగ్‌ చేశారు. గడ్డ కట్టించే చలిలో ఆయన ఈ సాహసం చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

కాగా గుంటూరు కారం సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. అలాగే ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్‌కు ముందే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లుగా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుంది.

ఆన్‌లైన్‌ లో మూవీస్‌ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + eighteen =