అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వేళ.. జై హనుమాన్ ప్రారంభించిన ప్రశాంత్ వర్మ

Director Prasanth Varma Started Jai HanuMan Pre-Production Work on Ram Mandir Opening Day

ప్రపంచవ్యాప్తంగా ‘హను-మాన్’ చారిత్రాత్మక విజయం తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. కాగా ‘హనుమాన్’ ముగింపులో ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్ ‘అనే సీక్వెల్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ప్రశాంత్ వర్మ గొప్ప సందర్భాన్ని ఎంచుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున, ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో యాగంలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి సినిమా స్క్రిప్ట్‌ను హనుమంతుని విగ్రహం ముందు ఉంచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం తమకు లభించదని వారు భావించారు. కాగా భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకున్నారు. ఇది లార్జర్ దెన్ లైఫ్ కథతో భారీ కాన్వాస్, అగ్రశ్రేణి ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించబోతోంది. ఈ సందర్భంగా రెండు పోస్టర్లను విడుదల చేశారు. ఒకటి ప్రశాంత్ వర్మ హనుమంతుని ముందు నిలబడి స్క్రిప్ట్‌ను పట్టుకున్నట్లు చూపిస్తే, మరొకటి సీక్వెల్ ప్రకటించిన హను-మాన్ నుండి చివరి సీక్వెన్స్‌ను చూపుతుంది. ఇక ఈ మాగ్నమ్ ఓపస్ సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 15 =