సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమా దాదాపు 700 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు ఫ్యాన్స్. ఎట్టకేలకు ఈనెల20వ తేదీన ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకొని రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ, మలయాళం భాషల్లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఓటీటీ లో కూడా ఈసినిమా తన హవాను చాటుతుంది. ఓటీటీలో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. తెలుగు వెర్షన్ మొదటి స్థానంలో నిలువగా.. తమిళ్ లో రెండవ స్థానంలో నిలిచింది అంటూ ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.
Devaratha Raisaar took over @NetflixIndia’s trending list 💥https://t.co/BwiclqCjzu#SalaarTopsOnNetflix #SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84… pic.twitter.com/eZUN6RMMr7
— Hombale Films (@hombalefilms) January 22, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: