ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఇంతవరకూ ఎన్టీఆర్ నుండి సినిమా రాలేదు. దీంతో తమ అభిమాన హీరోని సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులు అవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈసినిమా రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. రీసెంట్ గానే మాసివ్ షెడ్యూల్ ను నేడు హైద్రాబాద్ లో మొదలుపెట్టినట్టు సమాచరం. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ ను మొదలుపెట్టగా.. రెండు వారల పాటు ఈ షూటింగ్ ఉండనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో సైఫ్ అలీఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన మోకాలికి, భుజానికి గాయమైనట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ముంబైలోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాారు. ఇక దీనిపై సైఫ్ కూడా స్పందిస్తూ మన వృత్తిలో భాగమే ఈ గాయాలు.. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు. ఈనేపథ్యంలోనే దేవర టీమ్ కూడా తమ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం సార్.. మళ్లీ మీరు సెట్స్ కు వచ్చేంతవరకూ వెయిట్ చేయలేకపోతున్నాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
Wishing you a Speedy recovery, Saif sir! Get well soon. Can’t wait for your comeback on the sets. #Devara
— Devara (@DevaraMovie) January 23, 2024
మరి దేవర మూవీ రెండు పార్ట్ లుగా వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో సైఫ్ కు శస్త్ర చికిత్స అంటే కోలుకోవడానికి ఎక్కువ రోజులే పడుతుంది. మరి దీనివల్ల దేవర షూటింగ్ కు లేట్ అయితే ఆఎఫెక్ట్ రిలీజ్ పై పడేే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: