హనుమాన్ టీమ్‌ను అభినందించిన నాగచైతన్య

Naga Chaitanya Reviews on HanuMan, Praises Director Prashanth Varma and Teja Sajja

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు, నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, రామ్ పోతినేని, గోపిచంద్, రామ్ గోపాల్ వర్మ, రాధికా శరత్ కుమార్, శివ రాజ్ కుమార్, మాధవన్, సమంత వంటి స్టార్స్ హనుమాన్ సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. తాజాగా యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హనుమాన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ మేరకు ఆయన తన ఎక్స్ లో.. “హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అభినందనలు. ఇందులో కొత్త తరం ఆలోచనలు, సరికొత్త కాన్సెప్ట్ కనిపించాయి. సినిమా చూస్తున్నంతసేపు గూస్‌బంప్స్ మూమెంట్స్ కలిగాయి. ఈ సినిమాతో నన్ను మీరు సృష్టించిన విశ్వంలోకి తీసుకెళ్లారు. ఇక తేజా సజ్జా అద్భుతమైన నటనతో కన్విన్స్ చేసే విధంగా నటించాడు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యార్, వినయ్ రాయ్ లతో పాటు మొత్తం చిత్రబృందానికి శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు చైతూ. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘తండేల్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జాలర్ల ఇతివృత్తం కథాంశంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం కోసం చైతూ సరికొత్తగా మేకోవర్ కావడం విశేషం. తొలిసారిగా ఆయన ఇలాంటి తరహా పాత్రలో నటిస్తుండటం గమనార్హం. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను అలరించగా.. త్వరలోనే ‘తండేల్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + one =