గత ఏడాది రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్న సినిమా సప్త సాగరాలు దాటి పార్ట్ 1 అండ్ పార్ట్2. కన్నడలో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రెండు పార్ట్ లుగా వచ్చిన ఈసినిమా మొదటిపార్ట్ ను ముందుగా రిలీజ్ చేయగా కన్నడలో సూపర్ హిట్ అయింది. సప్త సాగరాలు దాటి సినిమాను ఇక్కడ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడా సూపర్ హిట్ అయింది. దాంతో పార్ట్ 2 ను కూడా రిలీజ్ చేశారు. పార్ట్ 2నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగాా వారికి గుడ్ న్యూస్ చెప్పారు రక్షిత్ శెట్టి. తన ట్విట్టర్ ద్వారా ఈసినిమా ఓటీటీ కి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను త్వరలో ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుందని తెలిపారు. అయితే డేట్ మాత్రం చెప్పలేదు. డేట్ ను ఫిక్స్ చేసిన తరువాత అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
#SSESideB is coming on Amazon soon. We will announce the date as it gets confirmed 🤗
— Rakshit Shetty (@rakshitshetty) January 20, 2024
హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమాలో రుక్మిణి వసంత్, చైత్ర ఆచర్ అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాకు సంగీతం చరణ్ రాజ్ అందించగా.. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: