టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. ఇప్పటికే తన తండ్రితో కలిసి అనేక సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న ఆమె మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది. తాజాగా సితార అనాథ పిల్లల కోసం మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ స్పెషల్ స్క్రీనింగ్‌ని ఏర్పాటు చేసింది. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏఎంబీ సినిమాస్ వేదికగా చీర్స్ ఫౌండేషన్ అనాథ పిల్లల కోసం గుంటూరు కారం ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఆదివారం స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరైన సితార ఘట్టమనేని.. ఆ చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. వారితో కలిసి గుంటూరు కారం సినిమా చూసిన ఆమె అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఇది చూసిన నెటిజన్లు సూపర్ స్టార్ కూతురు సితార చిన్న వయసులోనే ఇంతటి సామాజిక స్పృహ కలిగి ఉండటం అభినందనీయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్ ముందే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లే జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొడుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: