ఈ సంక్రాంతికి కూాడా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కింగ్ నాాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగ మూవీ కూడా ఒకటి. బిన్ని విజయ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నా సామిరంగ. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. చాలా కాలం తరువాత మాస్ రోల్ తో వచ్చిన నాగ్ మరోసారి తన సత్తా చూపించాడు. స్నేహం, ప్రేమ, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా పుంజుకుంటుంది. మొదటిరోజుతో పోల్చుకుంటే రెండే రోజు కలెక్షన్స్ మరింత పెరిగాయి. తొలిరోజు 4.33 కోట్ల కలెక్షన్స్ సాధించిన నా సామిరంగ మూవీ రెండో రోజు 4.55 కోట్ల కలెక్షన్స్ రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17.8 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. ముందు ముందు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లన్ హీరోయిన్లుగా నటించగా షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు తదితరులు నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మించారు ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం, దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: