ట్రెండింగ్‌లో.. విశ్వంభర గ్లింప్స్‌ అండ్ కాన్సెప్ట్ వీడియో

Megastar Chiranjeevis Vishwambhara Movie Title Glimpse and Concept Video Trending in Social Media, Vishwambhara Movie Title Glimpse, Megastar Chiranjeevis Vishwambhara Movie Title Glimpse, Vishwambhara Movie, Vishwambhara Telugu Movie, Title Glimpse Vishwambhara Movie, Vishwambhara, Chiranjeevis Vishwambhara Movie, Chiranjeevi, Chiranjeevi New Movie, Latest Tollywood Updates, Telugu Film News 2023, Tollywood Movie Updates, Telugu Filmnagar

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రానికి ‘విశ్వంభర’గా టైటిల్ ఖరారైన విషయం తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘బింబిసార’తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిన్న చిత్ర యూనిట్ ‘విశ్వంభర’ టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసింది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో కూడిన ఈ వీడియో సినిమాపై ఆసక్తిని అమాంతంగా పెంచేయగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీని ప్రకారం.. ‘విశ్వంభర’ ముల్లోకాలు, పంచభూతాలు నేపథ్యంలో జరిగే కథగా ఉండనుందని అర్థమవుతోంది. తొలుత దేవతల లోకంలో స్టార్ సింబల్ కలిగిన ఒక చిన్న పేటిక అనేక లోకాలను దాటుతూ విశ్వంలో తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ గ్రహ శకలాన్ని తగిలి ఆ పేటిక ఓ చోట పడిపోగా.. అప్పుడు భయంకరమైన అగ్ని జ్వాలలు ఎగిసిపడతాయి. అనంతరం ఆ పేటిక తెరుచుకొని వెలుగు వస్తుంది. ఆ వెలుగులో నుంచి విశ్వంభర అనే టైటిల్ వచ్చింది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్టు ఈ వీడియోలో మూవీ టీమ్ వెల్లడించింది.

కాగా యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న ‘విశ్వంభర’  మాస్టర్ పీస్‌గా రూపొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం గమనార్హం. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి, కీరవాణి కాంబోలో అనేక మ్యూజికల్ హిట్ మూవీస్ ఉన్న నేపథ్యంలో.. మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనుండటంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్స్ వివరాలు వెల్లడికానున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − nine =