కంగువ సెకండ్ లుక్ పోస్టర్ రిలీజ్.. స్టన్నింగ్ స్టిల్‌లో సూర్య

Suriyas Kanguva Second Look Poster Out, Suriyas Kanguva Second Look, Kanguva Second Look Poster Out, Kanguva Poster Out, Suriyas Kanguva Poster Released, Kanguva Movie, Kanguva Telugu Movie, Kanguva Second Look Poster, Suriya, Bobby Deol, Jagapathi Babu, Yogi Babu, Latest Tollywood Updates, Telugu Film News 2023, Tollywood Movie Updates, Telugu Filmnagar

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో రూపొందుతోంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 3డీ ఫార్మాట్‌లో కూడా విడుదలవనుండటం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సూర్య 42వ ప్రాజెక్ట్‌గా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ‘కంగువ’ నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ ‌వీడియో, పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్‍డేట్‌ ఇచ్చింది చిత్ర యూనిట్. పొంగల్ సందర్భంగా కంగువ సెకండ్‌ లుక్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం కంగువ సెకండ్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సూర్య రెండు విభిన్న లుక్స్‌లో కనిపించారు.

ఒక దానిలో బ్యాక్‌గ్రౌండ్లో మంటల్లో కాలిపోతున్న పక్షి ఒకటి కనిపిస్తుండగా.. దాని ముందు యుద్ధవీరుడి గెటప్‍లో హ్యాండ్‌పై టాటూస్‌ వేయబడి ఉన్న లుక్‌లో.. అలాగే మరోదానిలో నేటి కాలానికి తగ్గట్లుగా ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. కాగా ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుండగా.. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో విడుదల కానుంది. ఇక ఇటీవలే కంగువ షూటింగ్ పూర్తి చేసుకున్న సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్‌లో ‘సూర్య 43’లో నటించడానికి సిద్ధమయ్యారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =