నాకు ఇమిటేట్ చేయడం బాగా వచ్చు-మహేష్

i am good at imitation says mahesh babu

ఎంతోకాలంగా వెయిట్ చేసిన మహేష్ గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జనవరి12వ తేదీన రిలీజ్ అయి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈసినిమాలో మహేష్ మాస్ విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. మహేష్ డైలాగ్ డెలివరీ, మేకోవర్, డ్యాన్స్ తో వన్ మ్యాన్ షో చేశాడు. ఇక ఈసినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో జయరాం, రమ్యకృష్ణ, జగపతి బాబు, సునీల్, ఈశ్వరి రావు, రఘుబాబు నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం చిత్రయూనిట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ ఈసినిమా గురించి మరోసారి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈసినిమాలోని తన పాత్ర గురించి చెబుతూ.. నేను ఫంక్షన్ లో చెప్పినట్టు త్రివిక్రమ్ సినిమాలోనే ఆ మ్యాజిక్ జరుగుతుంది.. అది బహుశా నా పర్సనాలిటీ గురించి ఆయనకు తెలియడం వల్ల కావచ్చు. అంతేకాకుండా నేను చాలా బాగా అబ్జర్వ్ కూడా చెేయగలను.. నాకు ఇమిటేట్ చేయడం బాగా వచ్చు.. ఒక రెండు గంటలు ఎవరినైనా కలిస్తే వారిని యాజిటీజ్ దించేయగలను.. ఆ మనిషి ఎలా మాట్లాడతాడు.. ఎలా బిహేవ్ చేస్తాడు అని చేసేస్తాను.. అది త్రివిక్రమ్ గారికి బాగా తెలుసు..అలా ఖలేజాలో గుంటూరు కారంలో ఆ మ్యాజిక్ జరిగింది. చాలా ఎఫర్ట్ లెస్ గా కనిపిస్తుంది. చూసినప్పుడు నాకే మజా వచ్చింది. హీరో మాట్లాడిన ప్రతి మాట పేలింది. త్రివిక్రమ్ కు నాకు మధ్య ఉన్న ఆ ఫ్రెండ్షిప్ వల్లో లేక ఎక్కువ డిస్కస్ చేయడం వల్లనో ఇలాంటివి జరుగుతుంటాయి. నాకు తెలిసి ఇతర డైరెక్టర్లతో అది వర్కవుట్ అవ్వదు. సుదర్శన్ 35లో చూసినప్పుడు కూడా నాకే మజా వచ్చింది. సుదర్శన్ 35లో నేను దూకుడు చూశాను నాన్న గారితో.. ఆతరువాత అక్కడికి వెళ్లలేదు.. కానీ ఈసారి నేను నా పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి చూడాలనుకున్నా.. సితార అయితే హగ్ చేసుకొని థ్యాంక్యూ.. ఎక్స్ పీరియన్స్ చాలా బాగుంది.. సినిమాలో చాలా బాగున్నారు అని చెప్పింది. నేను చాలా హ్యాపీ.. అంటూ తెలిపారు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =