యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. ఎలాంటి ఎమోషన్ అయినా సరే చాలా ఈజీగా చేసేస్తాడు. ఇక ఎన్టీఆర్ వాక్చాతుర్యం గురించి కూడా అందరికీ తెలుసు. ఎన్టీఆర్ తో నటించిన వాళ్లు ఎవరైనా సరే ఆ విషయంలో ఎన్టీఆర్ ను పొగడకుండా ఉండలేరు. ఎన్ని పేజీల డైలాగ్స్ అయినా సరే ఒకే ఒక్క షాట్ లో ఓకే చేస్తాడని అందరూ భయపడుతుంటారు కూడా. అంతేకాదు భాషపై తనకు చాలా పట్టు ఉంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడగలిగే హీరోల్లో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో మెట్టు ఎక్కేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్టీఆర్ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీలో తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అయితే అప్పుడు మలయాళంలో మాత్రం డబ్బింగ్ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ మైల్ స్టోన్ ను కూడా దాటేశాడు. దేవర సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలకు డబ్బింగ్ చెబుతున్నాడు.. వీటితో పాటు ఈసారి మలయాళంలో కూడా డబ్బింగ్ ను చెప్పబోతున్నాడు. మరి ఎన్టీఆర్ డిక్షన్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. మలయాళంలో కూడా ఎన్టీఆర్ తన సత్తా చూపిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా వస్తుంది. ఈసినిమా షూటింగ్ ను ముంగించుకునే పనిలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: