ఇండియాలోని గొప్ప నటుల్లో మహేష్ బాబు ఒకరు – మీనాక్షి చౌదరి

Mahesh Babu is One of India's Greatest Actors, Says Meenakshi Chaudhary

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ, సంగీత దర్శకుడు థమన్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్న ఈ ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల కేరింతల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కథానాయిక కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా త్రివిక్రమ్ గారికి చాలా చాలా థాంక్స్. ఆయనతో కలిసి పని చేయాలనే కల నెరవేరింది. ఈ సినిమా వల్ల త్రివిక్రమ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనను అందరూ గురూజీ అని ఎందుకు పిలుస్తుంటారో నాకు అర్థమైంది. ప్రతిష్టాత్మక బ్యానర్‌లో రూపొందిన ఈ ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు వంశీ గారికి, చినబాబు గారికి ధన్యవాదాలు” తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “డ్యాన్సింగ్ స్టార్ శ్రీలీల సెట్స్‌లో ఎంతో ఎనర్జీ తీసుకొచ్చింది. తనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. మహేష్ బాబు గారి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కాల్ వచ్చినప్పుడు మొదట షాక్‌లో ఉన్నాను. మొదటి రోజు అంత పెద్ద స్టార్‌తో కలిసి పని చేయడం కాస్త నెర్వస్ గా అనిపించింది. కానీ మహేష్ గారు ఆ నెర్వస్ పోగొట్టి కంఫర్టబుల్‌గా ఉండేలా చేశారు. ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో మహేష్ గారు ఒకరు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ గారి మాస్ ఫిల్మ్ జనవరి 12న వస్తుంది. థియేటర్లలో కలుద్దాం” అని మీనాక్షి చౌదరి అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eight =