తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. ఆయన డేట్స్ లేకపోయినా వెయిట్ చేసి మరీ ఆయన డేట్స్ తీసుకునేవాళ్ళు. అలా తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు చాలా సెలక్టివ్ గా పాత్రలను ఎంచుకుంటూ పలు సినిమాల్లో కనిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా కేవలం సినిమాలు మాత్రమే కాదు బ్రహ్మీలో చాలా నైపుణ్యాలు ఉన్న సంగతి తెలిసిందే. మంచి చిత్రకారుడు కూడా. ఈమధ్య తను వేసిన చిత్రాలు చూస్తే చెప్పొచ్చు ఎంత ప్రతిభ ఉందో. ఇప్పుడు నేను అనే బుక్ తో రాబోతున్నారు. తన జీవితం గురించిన విషయాలతో పాటు.. తనకు తెలిసిన కొన్ని మంచి మాటలను ఆయన ‘నేను’ పేరుతో పుస్తకరూపంలో తీసుకొస్తున్నారు. ఈ పుస్తకం ద్వారా బ్రహ్మీ జీవితంలో జరిగిన విషయాలను తెలుసుకోవచ్చు. తాజాగా దీనిపై రామ్ చరణ్ తమ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. నేను అనే పుస్తకం ద్వారా బ్రహ్మానందం గారి అద్భుతమైన జర్నీని తెలుసుకుందాం.. హాస్యం ఇంకా హృదయం అనే రెండు సమ్మేళనాలతో ఈ ఆటోబయోగ్రఫి రాయబడింది.. ఈ పుస్తకంలోని పేజీలు నవ్వులతో, జీవిత పాఠాలతో, సినీమాటిక్ చార్మ్ తో నిండి ఉన్నాయి. అమెజాన్ లో ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోండి అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
Journeying through the incredible life of #Brahmanandam Garu in ‘NENU,’ his autobiography crafted with humor and heart. 📘 These pages hold the essence of laughter, life lessons, and the cinematic charm he brought to us all.
Order the book through this link:… pic.twitter.com/kY7qgaFtrS
— Ram Charan (@AlwaysRamCharan) January 10, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: