సెన్సార్ పూర్తి చేసుకున్న సైంధవ్‌.. విడుదలకు సిద్ధం

Saindhav Censor Board Issued UA Certificate For Venkatesh Film

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైంధవ్‌’. కాగా ఆయనకి ఇది 75వ చిత్రం కావడం విశేషం. ‘హిట్’ ఫేమ్ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతోంది. ‘చంద్రప్రస్థ’ అనే ఒక ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ జరుగనుంది. ఈ మూవీలో ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సైంధవ్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ జారీ చేసింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘సైంధవ్‌’ గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. కాగా ‘సైంధవ్’ యూనిక్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. పాటల్లో చూపినట్లుగా, తండ్రీ కూతుళ్ల బంధం సినిమాలో ప్రధాన అంశం, ఇందులో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య మెచ్యూర్ రిలేషన్ షిప్ కూడా మనం చూడవచ్చు. తన కూతురితో కలిసి సింగిల్ పేరెంట్‌గా ఉన్న వెంకటేష్‌కి సహాయం చేయడానికి ఆమె వస్తుంది.

కాగా ‘సైంధవ్‌’ ద్వారా బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. అలాగే కోలీవుడ్‌ స్టార్ హీరో ఆర్యమరో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే బేబీ సారా పాలేకర్‌తో పాటు రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, జిషు సేన్ గుప్తా, జయప్రకాష్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూరుస్తుండగా.. ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తుండగా.. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 7 =