రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ నిన్నటి తో రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.మొదటి వారం ఈసినిమా గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపింది.వారం రోజుల్లో 500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక నిన్న కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరో 70కోట్ల వరకు వుంది.ప్రస్తుతం పెద్దగా పోటీ లేకపోవడం సలార్ కు కలిసి రానుంది.ఇక సలార్ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోకూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్నటి తో హిందీలో 100కోట్ల నెట్ మార్క్ ను క్రాస్ చేసింది.ప్రభాస్ ఈ ఫీట్ సాధించడం 5వసారి.ఇంతకుముందు బాహుబలి 1&2 ,సాహో,ఆదిపురుష్ ఈరికార్డు సాధించాయి.తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముఖ్యంగా నైజాంలో సలార్ అదరగొడుతుంది.నిన్నటివరకు 60కోట్ల షేర్ ను రాబట్టుకొని బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.
ఓవరాల్ గా అయితే రెండు రాష్ట్రాల్లో కలిపి 130కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక మొదటి పార్ట్ సీజ్ ఫైర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుండడం తో సలార్ రెండో పార్ట్ శౌర్యంగా పర్వం ఫై అంచనాలు పెరిగాయి.మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: