ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘యాత్ర’. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, వైఎస్సార్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించగా.. సీనియర్ నేత గౌరు చరిత క్యారెక్టర్‌లో నటి అనసూయ కీలక పాత్రలో కనిపించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ‘యాత్ర 2’ నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈరోజు (డిసెంబర్ 21, 2023) సీఎం జగన్ జన్మదినం సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఒకవైపు చైర్‌లో జీవా కూర్చొని ఉండగా.. మరోవైపు ఆయన వెనుక మమ్ముట్టి మరో చైర్‌లో అటు తిరిగి కూర్చుని కనిపించారు. ఇద్దరూ ఎంతో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఇటీవలే ఈ సినిమా మేజర్ షెడ్యూల్ వైఎస్ ఫ్యామిలీ ప్రాతినిథ్యం వహించే పులివెందులలో జరిగింది. యాత్ర 2లో జీవా, వైఎస్ జగన్‌గా నటించడం కాదు, జీవించేస్తున్నాడు అని టాక్ నడుస్తోంది.
కాగా ‘యాత్ర 2’లో ప్రధానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘట్టాలను చూపించనున్నారు. ముఖ్యంగా.. జగన్ రాజకీయ రంగప్రవేశం, అందుకు దారి తీసిన పరిస్థితులు, సొంతంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించడం, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టడం.. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం వంటివాటిని విపులంగా వివరించనున్నారు. కాగా పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా 2024 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: