మొత్తానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య రానున్న ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రభాస్
ఈసినిమాకు ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ రావడంతోనే ఈసినిమా రేంజ్ మారిపోయింది. బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ ఆ తరువాత పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. టాప్ మోస్ట్ మేకర్స్ కూడా ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఆ రేంజ్లో లోనే సినిమాలు చేయడానికి వస్తున్నారు. ఈసినిమాకు కూడా ప్రధాన బలం ప్రభాసే. ప్రభాస్ ను చూసే థియేటర్ కు వచ్చేవాళ్లు చాలా మంది ఉన్నారు.
ప్రశాంత్ నీల్
కన్నడ పరిశ్రమలో ప్రశాంత్ నీల్ అనే ఒక ఉన్నాడన్న సంగతి కేవలం ఆ పరిశ్రమకే తెలుసు. కానీ కె.జి.యఫ్ తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కె.జి.యఫ్ 2 తో కూడా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. అలాంటి డైరెక్టర్ నుండి ఇప్పుడు రాబోతున్న సినిమా సలార్. దీంతో ఈసినిమాపై మొదటినుండే భారీ అంచనాలు పెరిగాయి. దానికితోడు ప్రశాంత్ నీల్ కూడా ఓ మంచి కథతో వస్తున్నట్టే అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్,ట్రైలర్ లను బట్టి.
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్
ఒక వైపు పాన్ ఇండియా స్టార్.. మరోవైపు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుంది. ఈనేపథ్యంలోనే సలార్ సినిమాతో వస్తున్నారు. ఎప్పుడైతే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటించారో అప్పటినుండే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. దీంతో ఈసినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కథ
నిజానికి ఈసినిమాను ముందు నుండి ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే అనుకున్నారు. అందులోనూ ప్రశాంత్ నీల్ కె.జి.యఫ్ తరువాత వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ అనుకున్నారు అందరూ. అయితే ఈసారి యాక్షన్ తో పాటు ఫ్రెండ్షిప్ ను కూడా జోడించి సలార్ తో వస్తున్నాడు. ప్రభాస్, పృథ్వీ రాజ్ మధ్య స్నేహాన్ని చూపిస్తూనే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవి కూడా ఉండేలా ఈసినిమాను తెరకెక్కించాడు.
కాస్టింగ్
ఇక ఒక సినిమాకు మంచి క్రేజ్ రావాలంటే ఆ సినిమా కాస్టింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసినిమా లో ప్రభాస్ తో పాటు జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్, శ్రేయ రెడ్డి, ఈశ్వరీరావు లాంటి టాలెంటెడ్ నటీ నటులు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈమధ్య కాలంలో టాప్ నిర్మాణ సంస్థగా మారిన హోంబలే ఫిలిమ్స్ పతాకంపై ఈసినిమా రావడం కూడా ఈసినిమాకు ప్రధాన బలంగా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: