దళపతి విజయ్ తన తరువాత సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా విజయ్ 68 అనే టైటిల్ వర్కింగ్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా టైటిల్ బాస్ అని ఫిక్స్ చేస్తున్నట్టు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ వార్తలు కాస్త మేకర్స్ దృష్టికి వెళ్లడంతో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈసినిమా నిర్మాత అర్చన తన సోషల్ మీడియా ద్వారాా స్పందిస్తూ అన్ని వార్తలను చూస్తున్నా.. మీ ప్రేమకు థ్యాంక్స్.. కానీ నిజమైన టైటిల్ వచ్చేంతవరకూ ఓపికతో వెయిట్ చేయండి.. వెంకట్ ప్రభు మీ కోసం సంథింగ్ ప్రిపేర్ చేస్తున్నారు.. ఈసినిమా టైటిల్ ఖచ్చితంగా బాస్ అయతే కాదు అని క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Just saw all the updates. Thank you for the love ❤️ Keep calm and wait for the real one very soon @vp_offl is cooking something special. It is definitely not Boss or Puzzle 😊 Happy Morning everyone ❤️ #Thalapathy68
— Archana Kalpathi (@archanakalpathi) December 20, 2023
కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: