నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. కండలు తిరిగిన దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్ట్ వర్క్ చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎప్పటినుండో ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న చిత్రయూనిట్ రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక నేడు ఈసినిమా షూటింగ్ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈరోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఉడిపిలో ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని మల్పే పోర్ట్ (ఉడిపి)లో జరుగుతోంది. యాక్టర్స్ అందరూ పాల్గొంటున్న ఈ కీలక షెడ్యూల్ లో చిత్ర యూనిట్ టాకీ, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తారట. అంతేకాదు ఇక్కడే నాగ చైతన్యతో పాటు ఫైటర్స్ పై యాక్షన్ సీక్వెన్స్ తీస్తారని తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: