ప్రశాంనీల్ దర్శకత్వంలో ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటి భాగం సలార్-సీజ్ ఫైర్ డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ అవ్వడం కామన్. కానీ ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా అదే రేంజ్ లో ఉందని చెప్పడానికి ఈ ప్రీ సేల్స్ ను బట్టి మరోసారి రుజువైంది. యూఎస్ఏలో ఈసినిమా ఇప్పటికే ఏకంగా 1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని రాబట్టుకుంది. ఇక రిలీజ్ డేట్ కి 2 మిలియన్ ని క్రాస్ చేసిన ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు.
Breaking the Barriers 🙏🏻🔥#Salaar smashes the charts with an unprecedented $1.5 Million in USA Premiere Advance Sales 🔥🔥
clinching the top spot among all Indian film premieres this year 😎😎#Prabhas #SalaarCeaseFire #SalaarTakeOverUSA pic.twitter.com/6cTfTZaqWJ— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 20, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: