సలార్ మేనియా మొదలైపోయింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే వరుస అప్డేట్లు ఇస్తూ సినిమాపై అంచనాలను అంతకంత పెంచేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి రెండు ట్రైలర్లను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు ట్రైలర్లు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగాా ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇచ్చారు చిత్రబృందం. ఈసినిమా టికెట్ బుకింగ్ ను ఓపెన్ చేశారు. ముందుగా నైజాం బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్టు అధికారికంగా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#SalaarNizamBookings opens online today at 8:24 PM 🔥#SalaarCeaseFire Nizam Release by @MythriOfficial 💥
Stay tuned 🎟️ https://t.co/k9kT5h9uJr#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84… pic.twitter.com/ehguYCuXmI
— Salaar (@SalaarTheSaga) December 19, 2023
కాగా ప్రశాంనీల్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటి భాగం సలార్-సీజ్ ఫైర్ డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: