బిగ్ బాస్ సీజన్ 7.. అలా మొదలై ఇలా పూర్తయినట్టు ఉంది. అన్ని సీజన్లకు భిన్నగా ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈసీజన్ దానికి తగ్గట్టుగానే సాగింది. ఎక్కడా బోర్ కొట్టించకుండా.. ఆద్యంతం ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తూ అలరించారు. ఇక ఫైనల్ గా ఈ సీజన్ అయితే పూర్తయిపోయింది. 18 మంది కంటెస్టెంట్లతో ఈసీజన్ మొదలైపోయింది. ముందు కొంతమంది కంటెస్టెంట్లను హౌస్ లో పంపించారు. ఆతరువాత 2.0 అంటూ మరికొంతమందిని హౌస్ లకి పంపించారు. అలా ఫైనల్ గా ఆరుగురు సభ్యులు ఫైనలిస్ట్ గా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ముందుగా ఫైనలిస్ట్ అయిన అర్జునే ముందు ఇంటినుండి బయటకు వచ్చేశాడు. ఆ తరువాత ఐదవ ఫైనలిస్ట్ అయిన ప్రియాంక ఎలిమినేట్ అయింది. అనంతరం నలుగురు సభ్యులు ఉండగా ప్రతి సీజన్లో డబ్బులు ఆఫర్ చేసినట్టే ఈ సీజన్ లో కూడా చేయగా యావర్ 15 లక్షలు తీసుకొని నాలుగో ఫైనలిస్ట్ గా ఎలిమినేట్ అయ్యాడు. ఆతరువాత శివాజీ ఎలిమినేట్ అయ్యాడు. ఫైనల్ గా యావర్, ప్రశాంత్ ల మధ్య పోటీ నిలిచింది. ఫైనల్ గా ప్రశాంత్ ఈ సీజన్ విజేయగా నిలిచాడు.
ఇక ఈ ఆసక్తికరమైన పోరులో ఈసీజన్ విజేతగా నిలిచి కామన్ మ్యాన్ సత్తాను చూపించాడు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ట్యాగ్ లైన్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ముందు కాస్త లవ్ ట్రాక్ అంటూ.. సింపతి గేమ్ అంటూ విమర్శలు వచ్చినా ఆ తరువాత ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున్ ఇచ్చిన హింట్లను తీసుకొని.. తనలో ఉన్న లోపాలన సరిచేసుకొని ఇప్పుడు విజేతగా నిలిచాడు. దానికి తోడు తాను అనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం.. ప్రతి గేమ్ లోనూ తన సత్తాను చూపడం.. అవసరమైన చోట ‘బరా బర్ చెప్తా … నేను ఇంతే’ అంటూ తన వాదనను బలంగా వినిపించడం వీటన్నింటికీ ఆడియన్స్ కలెక్ట్ అయి విజయాన్ని అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: