నాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న వీకెండ్ లో మంచి గ్రోత్ చూపించింది.శని,ఆదివారాల్లో ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 3కోట్లకు పైగా షేర్ ను రాబట్టగలింది.దాంతో మొత్తం 11రోజుల్లో 19కోట్ల షేర్ ను సొంతం చేసుకొని బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.ఇక యూఎస్ఏ లో ఈసినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. నిన్నటి వరకు అక్కడ 1.6మిలియన్ వసూళ్లను దక్కించుకుంది దాంతో 11రోజుల్లో హాయ్ నాన్న ప్రపంచ వ్యాప్తంగా 60కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవారం నుండి మాత్రం ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది. ఎందుకంటే ప్రభాస్ సలార్ శుక్రవారం థియేటర్లలోకి రానుంది దాంతో హాయ్ నాన్న కు రన్ కష్టమే అవొచ్చు.ఓవరాల్ గా చూస్తే ఈ ఏడాది నాని వరసగా రెండో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.సమ్మర్ లో ఊర మాస్ సినిమా దసరా తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టగా చివర్లో క్లాస్ మూవీ హాయ్ నాన్న తో సూపర్ హిట్ కొట్టాడు.శౌర్యువ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























