నాని సినిమాకి వెళ్దామని ప్రేక్షకులు అన్నారంటే.. అదే నాకు గొప్ప స్థాయి – హీరో నాని

Hi Nanna Blockbuster Celebrations: Nani Says Thanks To All Telugu Audience

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయమయ్యారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ అద్భుతమైన కలెక్షన్స్‌తో అన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది. ఈ వేడుకలో హీరో నాని చేతుల మీదుగా చిత్ర యూనిట్ సభ్యులకు మెమెంటోలు అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బ్లాక్ బస్టర్ నాన్న సెలబ్రేషన్స్‌లో హీరో నాని మాట్లాడుతూ.. హాయ్ నాన్న జర్నీ వీడియో చూసినప్పుడు ఇన్ని చోట్ల తిరిగామా అనిపించింది. ఇది చాలా స్పెషల్ ఫీలింగ్. సినిమా విజయం తర్వాత జరుపుకునే ఇలాంటి వేడుకలో ఒకరికి ఒకరు థాంక్స్ చెప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ వేడుకలో అందరితో కలసి గడపటం గొప్ప అనుభూతిని ఇస్తోంది. హాయ్ నాన్నకి మ్యాజిక్ కియరా. మృణాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. దర్శి ఈ సినిమాతో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు. ఇందులో నటించిన అందరూ తమ సినిమా అని ఓన్ చేసుకున్నారు. జయరామ్ గారు, నాజర్ గారు, శిల్పా గారు బ్రిలియంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. రితిక చాలా మంచి పాత్ర చేసింది”.

“హేషం ఏదైనా బోలెడంత ఇష్టం, ప్రేమతో చేస్తాడు. అది ప్రతి పాటలో, బీట్‌లో కనిపించింది. ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశాడు. మ్యాజిక్ క్రియేట్ చేశాడు. షాను గారు తెలుగులో చేసిన మూడు సినిమాలు నావే. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది. షాను గారు కెమరాతో కథ చెప్పగలిగే గ్రేట్ టెక్నిషియన్. తన ప్రతి ఫేం ఒక కథ చెబుతుంది. మోహన్, విజయేందర్ గారికి ఇది మొదటి సినిమా. కొత్త ప్రొడక్షన్ హౌస్‌కి మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలిగితే గొప్ప ఆనందంగా వస్తుంది. అలాంటి అనుభూతి హాయ్ నాన్నతో నేను ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ప్రేక్షకులు ఎన్నో ప్రశంశలు కురిపిస్తున్నారు. నేను నమ్మంది నిజమైనందుకు ఆనందంగా వుంది”.

“ఈ జర్నీ ఇంత అద్భుతంగా మొదలైనందుకు వారికి అభినందనలు. ఎడిటర్ ప్రవీణ్ అంథోని, ఆర్ట్ డైరెక్టర్ అవినాస్ ఇలా టీం అంతా సినిమాకి బలమైన సపోర్ట్ లా దర్శకుడు శౌర్యువ్ తో కలసిపని చేశారు. కృష్ణ కాంత్, అనంత్ శ్రీరామ్ గారు చక్కని సాహిత్యం అందించారు. రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థాంక్స్. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. విజయం రెండు రకాలుగా వుంటుంది. ఒకటి.. అందరూ గెలుస్తారని అనుకుంటారు.. వాళ్ళే గెలుస్తారు. రెండు.. అందరూ గెలవరేమో అనుకుంటారు.. వాళ్ళే గెలుస్తారు. ఈ రెండు రకాల విజయాలు 2023 నాకు ఇచ్చింది. ఒక స్టేడియం అంతా చీర్ చేస్తుంటే గెలవడం చూశాను. స్టేడియం అంతా సైలెంట్‌గా వుంటే గెలవడం చూశాను. రెండూ ఒక సంవత్సరంలోనే జరిగాయి. హాయి నాన్న లాంటి బ్యూటీఫుల్ ఫిల్మ్‌తో ఈ విజయం అందుకోవడం ఇంకా స్పెషల్”.

“బాక్సాఫీసు లెక్కలు, స్థానాలు, స్థాయిలని మాట్లడుతుంటారు. నాకు సంబంధించినంత వరకూ శుక్రవారం సినిమా విడుదలైతే ‘’నాని సినిమాకి వెళ్దాంరా’ అని ప్రేక్షకులు అన్నారంటే అదే గొప్ప స్థాయి. దానికి మించిన స్థాయి ప్రపంచంలో మరొకటి లేదని నమ్ముతాను. ఆ స్థాయి, స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంటాను. హాయ్ నాన్నని ఇంత పెద్ద సక్సెస్ చేసిందుకు, మీ మనసులో పెట్టుకున్నందుకు తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు ఎప్పటికీ రుణపడి వుంటాం. ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే వుంటాను. ఈ రోజు తర్వాత హాయ్ నాన్న టీమ్‌ని మిస్ కావచ్చు, కానీ హాయ్ నాన్నకి వచ్చిన ప్రేమని మాత్రం మిస్ కాను. ఈ ప్రేమ ఎక్కడా ఆగదు. అందరికీ ధన్యవాదాలు’’ అని హీరో నాని పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 4 =