నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైెటెడ్ సినిమా డెవిల్. లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 29 వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటీజర్, ట్రైలర్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి దూరమే తీరమని సోల్ ఫుల్ మెలొడీ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈపాట ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దూరమే తీరమై నింగి తాకే నేలని. తారలే చేరువై నన్ను చేరే ఆమని. కళ్ళముందర ఉంది నేడిలా.. ఎలా నీకు నేను చేరువైనా ఈ క్షణం అంటూ వచ్చే ఈపాట మెలోడియస్ గా ఉండి ఆకట్టుకుంటుంది.
Let the melody of #DoorameTheeramai from #DevilTheMovie serenade your heart. https://t.co/014A8J76HA
Song out now! 🎶❤️#DevilOnDec29th #Devil – The British Secret Agent@NANDAMURIKALYAN @iamsamyuktha_ #MalvikaNair
Directed & Produced by #AbhishekNama@vasupotini @soundar16… pic.twitter.com/Vtm7ErBaCS— ABHISHEK PICTURES (@AbhishekPicture) December 18, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: