బిగ్ బాస్ 7.. ఈ సీజన్ కూడా మరోవారంలో పూర్తవుతుంది. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈసీజన్ చెప్పినట్టుగానే అంతే ట్విస్ట్ లతో సీజన్ మొత్తం బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. ఇక గత వారం శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయిది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక, అమర్ ఉన్నారు హౌస్ లో. ఇక చివరి వారం కాబట్టి ఎలాంటి నామినేషన్స్ ఉండవు.. ఎలాంటి టాస్క్ లు ఉండవు. ఫైనలిస్ట్ లు కాబట్టి ఇన్ని రోజులు హౌస్ లో వారి జర్నీని చూపిస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ముందుగా అమర్ ను లాన్ లో పిలిచాడు బిగ్ బాస్. తన జర్నీ వీడియోను వేసి చూపించాడు. దాదాపు 16 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో చాలా బాగుంది. ఓ ఫుల్ మీల్స్ ప్యాక్ లాగ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అమర్ లో ఉన్న కామెడీ యాంగిల్, నవ్వులు, ఏడ్పులు, ఫ్రెండ్ షిప్, గొడవలు అన్నీ చూపించారు. వీడియోలో పొరపాటు చేయని వారుండరు.. వాటిని సరిదిద్దుకునే ముందుకెళ్లడం అసలైన లక్ష్యం అంటూ తెలిపాడు బిగ్ బాస్ . గెలవడం ఎంత ఇష్టమో.. నీకు జుట్టు అంటే కూడా నీకు అంతే ఇష్టం.. చిన్నపిల్లాడి మనస్తత్వం.. అల్లరి.. స్నేహితులు.. నువ్వు గోడౌన్ లో దాచుకున్న సరుకులు నీకూ నాకు మాత్రమే తెలుసు అని తెలిపాడు. వీడియో చూసిన అమర్ హ్యాపీగా ఫీలవుతూ ఒక సినిమా ట్రైలర్ చూసినట్టు ఉంది అంటూ బిగ్ బాస్ కు థ్యాంక్స్ చెప్పాడు.
ఆ తరువాత అర్జున్ వీడియోను వేశాడు బిగ్ బాస్. అర్జున్ వీడియోలో కదిలే బండిలో ఎక్కడం ప్రమాదం అయినా కూడా నువ్వు ఆ ప్రమాదాన్ని ఫీలవకుండా చాలా ధైర్యంగా నిలబడి వేరే వాళ్లకి ప్రమాదంలా మారావు. కండబలంతో పాటు బుద్ది బలాన్ని కూడా వాడి చాలా బాగా గేమ్ ఆడారు అంటూ కొనియాడాడు బిగ్ బాస్ .అయితే అర్జున్ వచ్చింది మధ్యలో అయినా తన ఇంపాక్ట్ ను మాత్రం చూపించాడు అన్నది ఈవీడియోతో మరోసారి నిరూపించాడు.
ఇక ఈరోజు వేసిన అమర్, అర్జున్ ల ఏవీలు అయితే చాలా బాగా ఆకట్టుకున్నాయి. మిగిలిన వారి జర్నీలు ఈ రెండు రోజుల్లో చూపించనున్నారు. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వబోతున్నారో తెలియాలంటే మరో రెండు రోజుల్ వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: